అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం

V6 Velugu Posted on Sep 21, 2021

బెంగళూరులో విషాదం జరిగింది. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దేవరచిక్కనహళ్లిలోని ఆశ్రిత్ అపార్ట్‌మెంట్‌లో ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పై అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్న మహిళ సజీవదహనం అయింది. 

గ్యాస్‌ పేలుడు జరిగిన తర్వాత ఆ వెంటనే మంటలు అపార్ట్‌మెంట్‌లోని మూడు ఫ్లాట్‌లకు వ్యాపించాయి. దీంతో ప్లాట్లలో కొంత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరి కొంత మంది అపార్ట్‌మెంట్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుండగా గాయపడ్డారు.

ఘటనా స్థలానికి మూడు అగ్నిమాపక యంత్రాలతో చేరుకున్న సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Tagged Bengaluru, Several Injured, Woman burnt alive, gas pipeline explodes

Latest Videos

Subscribe Now

More News