వామ్మో .. ఈ పిల్లకు ఎంత డేరింగ్ రా బాబూ..

వామ్మో .. ఈ పిల్లకు ఎంత డేరింగ్ రా బాబూ..

పాములు అంటే జనాలు భయపడతారు.  రెండు మూడు పాములు కనపడ్డాయా వెనక్కు తిరిగి చూడకుండా పరిగెత్తుతారు.   కొంతమంది పాము కాటు వేస్తే మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.  కాని ఓ మహిళకు ఎంత డేరంటే  మెలికలు వేసుకొని ఉన్న రెండు పాములను గమనించింది.  అటూ ఇటూ చూసింది.. ఇక అంతే ఒక్క సారిగా కాలువలోకి దూకి ఆ రెండు పాములను రెండు పాములను చేత్తో పట్టుకుంది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

సాధారణంగా పాములు అంటే అందరికి భయమే.. అవి కనపడితే చూసి చిచ్చు పోసుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. మరికొందరు భయపడకుండా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ చేసింది కూడా అలాంటి పనే. అస్సలు భయపడకుండా, బెదరకుండా మెలికలు వేసుకున్న రెండు పాములను పట్టుకుంది. 

ఈ వైరల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిపోయింది. మన దేశంలోనే ఎక్కడో తెలియదు కానీ, ఓ విద్యా కేంద్రంలో ఇది చోటు చేసుకుంది. పాములను చూసిన ఆమె ఒక్కసారిగా కాలువలోకి దిగిపోయి రెండు చేతులతో రెండింటినీ పట్టేసుకుంది. ఒకటి తప్పించుకుని పారిపోతుండగా, తిరిగి పట్టేసుకుంది. వాటిని అదుపు చేయడానికి ఆమె ప్రయత్నం చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. 

సాధారణంగా నాగుపాము అయితే ఎంతో చురుగ్గా ఉంటుంది. బుస్ అంటూ పడగవిప్పి కాటు వేస్తుంది. కానీ, ఇక్కడ సదరు మహిళ పట్టుకున్న పాములు తాచు పాములు లేదా విషపూరితమైనవి కానట్టుంది. ఎందుకంటే అవి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయే కానీ, ఎదురుదాడికి దిగడం లేదు. ఈ మహిళ పట్టుకున్న పాములు తాచు పాములు లేదా విషపూరితమైనవి కానట్టుంది. ఆ పాములను చూస్తుంటే జెర్రిపోతుల్లాగా కనిపిస్తున్నాయి. అవి మనుషులను చూస్తే భయపడి పోతుంటాయి. అందుకోసమని అవి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయే కానీ.. ఆ మహిళపై దాడి చేయడం లేదు.

మరోవైపు ఈ వీడియోపై పలువును నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీడియోను చూసిన కొందరు అభినందిస్తుంటే, కొందరు ఆమె ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు యూజర్లు అయితే ఆ పాములను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు.