ఫేస్ బుక్ పరిచయంతో రూ.20 లక్షలు కొట్టేసింది

ఫేస్ బుక్ పరిచయంతో రూ.20 లక్షలు కొట్టేసింది

కొత్తగూడెం :  ఫేస్‌బుక్‌ లో హాయ్ అంటూ మెసేజ్ చేసింది. రిప్లై రావడమే ఆలస్యం నైస్ గా మెసేజ్ చేస్తూ ఓ యువకుడిని పరిచయం చేసుకుంది. ఆ తర్వాత ఈ కిలాడీ లేడీ రూ.20 లక్షలు కాజేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల కేంద్రానికి చెందిన గిన్నారపు నాగేందర్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా లండన్‌ కు చెందిన మెర్సీ జాన్సన్‌ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య కాస్త చనువు పెరగడంతో నాగేందర్‌ ను మోసం చేసేందుకు యువతి ప్లాన్ వేసింది.

రూ. 20లక్షలు ఇస్తే మీకు రిటర్న్‌గా 70వేల పౌండ్లు వస్తాయని నాగేందర్‌ ను నమ్మించింది. వెంటనే నాగేందర్‌ విడతల వారిగా రూ.20లక్షలను యువతి అకౌంట్‌లో డిపాజిట్‌ చేశాడు. తర్వాత తనకు రావాల్సిన నగదు రాకపోవడంతో మోస పోయానని తెలుసుకున్న నాగేందర్‌ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌ నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఆ యువతి పేరుతో ఫేస్ బుక్ ప్రొపైల్ బ్లాక్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశాడు.