
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పాలన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో బిల్లు.. చట్టంగా మారిందని సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఈ చట్టాన్ని విప్లవాత్మక సంస్కరణగా మంత్రి అభివర్ణించారు. పార్లమెంట్‌లో మొదట తీసుకొచ్చిన బిల్లుకు రెండు ప్రధాన సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెట్టారు. ఇందులో సమాచార హక్కు పరిధిని కుదించారు. ప్రభుత్వ నిధులతో నడిచే వాటిని దీని పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక బీసీసీఐని దీని పరిధిలోకి తీసుకురాలేదు. జాతీయ సమాఖ్యల్లో ఉన్నత పదవులకు పోటీ చేసేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక్క టర్మ్ పని చేసినా అర్హులు అవుతారు. గతంలో ఇది రెండు టర్మ్‌లుగా ఉండేది. దీనివల్ల యువ అథ్లెట్లు, యంగ్ అడ్మినిస్ట్రేటర్లకు లాభం చేకూరనుంది.