రోడ్డు పక్కన చెత్తతో ప్రతి నెలా రూ.4లక్షల ఆదాయం

రోడ్డు పక్కన చెత్తతో ప్రతి నెలా రూ.4లక్షల ఆదాయం

నేటి కాలంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు డిగ్రీలు చేసి ఉద్యోగం చేస్తున్నారు. అందుకే కొందరు సొంతంగా వ్యాపారం చేస్తూ సంపాదిస్తున్నారు. అయితే కొందరు మాత్రం అందరి కంటే భిన్నంగా ఆలోచించి, వినూత్న రీతిలో డబ్బు అర్జిస్తున్నారు. వారు చేస్తున్న పనులు, వారికి వస్తోన్న సంపాదన ఎంతో తెలిస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అలాంటి పనే అమెరికా నివాసి వెరోనికా కూడా చేస్తుంది. తన స్నేహితురాలు లిజ్ విల్సన్‌తో కలిసి చెత్తను సేకరిస్తోంది. ఇలా వారిద్దరూ ఇప్పటివరకూ లక్షల్లో సంపాదించారు.

వెరోనికా టేలర్, ఆమె వ్యాపార భాగస్వామి లిజ్ విల్సన్ చెత్తతో లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న డస్ట్‌బిన్‌లో పడేసిన పర్సులు, ఇతర బ్రాండెడ్ వస్తువులను సేకరించి, వాటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు. ఈ వేలం కోసం వారు WhatNot సైట్‌ని ఉపయోగిస్తున్నారు. ప్రజలు కూడా వీరు అమ్మే డిజైనర్ వస్తువులను చౌక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా స్నేహితులిద్దరూ నెలలో దాదాపు నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు.

వెరోనికా, లిజ్ చాలా కాలంగా చెత్తతో డబ్బు సంపాదిస్తున్నారు. వీరికి చెత్త సేకరణ సమయంలో ఆహారం దొరికితే.. వాటిని వారు దానం కూడా చేస్తారు. ఈ పని తమకు చాలా ఉత్తేజకరంగా ఉందని, చెత్తను సేకరించేటపుడు  ఏదో నిధి కోసం వెతుకుతున్నట్లు అనిపిస్తుందని వెరోనికా చెప్పారు. ప్రతిరోజూ ఏదో కొత్త వస్తువు తమకు దొరుకుతుందని, దాని వల్ల కూడా వారు సంపాదనను పొందుతామని తెలిపారు,