- వార్డు స్థానానికి తల్లీకూతురు, తోడికోడలు పోటీ
- నల్గొండ జిల్లా ఏపూరులో ఘటన
చిట్యాల, వెలుగు : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు నామినేషన్లు వేయడం, విత్‌డ్రా విషయంలో గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని మూడో వార్డుకు బండ అశ్వినితో పాటు ఆమె తోడికోడలు అర్చన, తల్లి మందుల లక్ష్మమ్మ (40) వేర్వేరుగా నామినేషన్ వేశారు.
దీంతో కూతురు పైన పోటీ చేయలేనంటూ లక్ష్మమ్మ నామినేషన్ విత్‌డ్రా చేసుకునేందుకు సిద్ధపడడంతో కుటుంబసభ్యులు వద్దని వారించారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే అశ్విని బుధవారం తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకుంది. ఈ విషమం తన తల్లి లక్ష్మమ్మకు చెప్పడంతో... ఆమె కూడా విత్ డ్రా చేసుకునేందుకు వెళ్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మమ్మ ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
