
ఎన్నికల విధులను నిర్వహించేందుకు వెళుతున్న ఓ లేడి కానిస్టేబుల్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హతమార్చారు. ఈ దుర్ఘటన ఏపీ లోని విశాఖ పట్టణంలో జరిగింది. నగరంలోని ఎయిర్ పోర్ట్ ఏరియాలో ఎలక్షన్ డ్యూటీకి బైక్ పై వెళుతున్న కానిస్టేబుల్ లక్ష్మీకాంతంను కొందరు దుండగులు గుర్తు తెలియని వాహనంతో వెంబడించి ఢీకొట్టారు. ప్రమాదంలో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడిక్కక్కడే మృతి చెందింది. ఆ తర్వాత దుండగులు వచ్చిన వెహికల్ లోనే పారిపోయారు.
మధురవాడ పీఎస్ పరిధిలోని పంజాబ్ హోటల్ జంక్షన్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ దారుణానికి పాల్పడ్డ వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.