నిమిషంలో అర కేజీ వెన్న తినేసింది.. గిన్నిస్ రికార్డ్ అంట.

నిమిషంలో అర కేజీ వెన్న తినేసింది.. గిన్నిస్ రికార్డ్ అంట.

ప్రపంచంలో వింత వింత మనుషులు కనిపిస్తుంటారు. వారు చేసే వింత పనులు సైతం ఒక్కోసారి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొస్తాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం యూరోపియన్ మహిళ అచ్చం ఇలాంటి పనే చేసింది. తను సాధించిన ఈ అరుదైన ఫీట్ చూస్తూ వావ్.. అంటూ ఆశ్చర్యపోవాల్సిందే!

సాధారణంగా ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలకు మంచి గుర్తింపు వచ్చేందుకు ఫుడ్  వేగంగా తినే పోటీలను ఏర్పాటు చేస్తుంటారు. తక్కువ సమయంలో ఎవరు ఎక్కువ ఫుడ్ తిన్న వారినే  విజేతగా ప్రకటిస్తారు. వెన్న పట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది.  ఇది కొద్దిగా టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది.  అయితే కిలోలకు కిలోలు లాగిస్తే మాత్రం నాలుకకు చుట్టుకు పోతుంది.  కాని ఓ మహిళ అరకిలో వెన్నను ఒకే నిమిషంలో తిని రికార్డ్ సృష్టించింది.  

వివరాల్లోకి వెళ్తే..

అరకిలో వెన్న ఇచ్చి మీరు తినగలరా? అని ఎవరైనా ఛాలెంజ్ విసిరితే మీరు తినగలరా? ఆలోచిస్తారు కదా.. యూరోపియన్ లేడీ లేహ్ షట్కేవర్ అలా కాదు. క్షణాల్లో తినేసింది. తాజాగా అరకిలోవెన్న  తిని వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ ఒక్క రికార్డే కాదు ఆమె ఖాతాలో 33 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్స్ ఉన్నాయట.

ఒక నిముషం 2.34 సెకండ్లలో...

లేహ్ షట్కేవర్.. చీజ్ ఛాలెంజ్ స్వీకరించడమే కాదు.. కేవలం ఒక నిముషం 2.34 సెకండ్లలో 500 గ్రాముల మోజారెల్లా వెన్న ను తినేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ రికార్డ్‌కి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో లేహ్ షట్కేవర్‌కి ఎదురుగా ఉన్న టేబుల్ మీద తెల్లటి ప్లేట్‌లో రెండు పెద్ద మోజారెల్లా వెన్న   బ్లాక్స్ కనిపిస్తాయి. టైమర్ స్టార్ట్ కాగానే ఆమె రెండిటినీ తినడం కనిపిస్తుంది. రెండో బ్లాక్ తింటున్నప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించినా రికార్డ్ మాత్రం బద్దలు కొట్టింది. తన పేరు మీద ఇప్పటికే 33 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్స్ ఉన్నాయి. ఆమె ప్రొఫెషనల్ ఈటర్.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ యాజమాన్యం 1 నిముషం 2.34 సెకండ్లలో 500 గ్రాముల మోజారెల్లా తినడానికి వేగవంతమైన సమయం అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసారు. వీడియో చూసిన నెటిజన్లు కాస్త అయిష్టత చూపించారు. ఈ వీడియో చూసినందుకు నాకు ప్రపంచ రికార్డు ఇవ్వండి అని ఒకరు.. ఇది చాలా అనారోగ్యకరమైనది.. మీరు రికార్డ్ కోసం ఏమైనా చేస్తారా? అంటూ కామెంట్లు పెట్టారు. లేహ్ షట్కేవర్ రికార్డుల కోసం చేసిన ప్రయత్నాల్లో రెండుసార్లు వామిటింగ్ చేసుకుందట. అయినా పట్టు వదలకుండా రికార్డులు సాధిస్తూ ముందుకు వెళ్తోంది.