పిల్లర్బాక్స్పడి మహిళ మృతి.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఘటన

పిల్లర్బాక్స్పడి మహిళ మృతి.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఘటన

కాగజ్‌‌‌‌నగర్, వెలుగు: ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న చోట ప్రమాదవశాత్తు పిల్లర్​బాక్స్​ మీద పడడంతో ఓ మహిళ మృతిచెందింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కొర్శిని గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సిడం సుగుణ(45) వితంతువు. ఆమెకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. మంగళవారం మేస్త్రీ ఇంటి పిల్లర్లు పోసి వెళ్లిపోయాడు. సాయంత్రం సమయంలో ఇంటి సమీపంలో మట్టిని తొలగిస్తుండగా ఒక్కసారిగా పిల్లర్ బాక్స్ కూలి ఆమెపై పడింది. కాంక్రీట్ మిశ్రమం, మట్టిలో ఆమె చిక్కుకుపోయి ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జీవన్ తెలిపారు.