నీళ్లలో తలకిందులుగా నడవడం ఎప్పుడైనా చూశారా?

నీళ్లలో తలకిందులుగా నడవడం ఎప్పుడైనా చూశారా?

నీళ్లలో ఈత కొట్టడం, ఆసనాలు వేయడం తెలుసు. కానీ, నడవడం గురించి ఎప్పుడైనా విన్నారా? అది కూడా తలకిందులుగా! ఇంకా చెప్పాలంటే నీళ్లలో తలకిందులుగా క్యాట్​వాక్​ చేయడం ఎవరైనా చూశారా? అసలు అది సాధ్యమేనా అనుకుంటున్నారా? మనందరికీ అసాధ్యం కావచ్చు. కానీ, క్రిస్టినా మకుషెంకోకు మాత్రం చాలా ఈజీ. అమెరికాలోని న్యూయార్క్​లో ఉంటుందీమె. సింక్రనైజ్డ్​ స్విమ్మింగ్​లో నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్​.

నీళ్ల అడుగున డాన్స్​ వేయడం, పర్ఫార్మ్​ చేయడం క్రిస్టినాకు చాలా ఈజీ. ఆమె ఇటీవల తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో పోస్ట్ చేసిన ఒక వీడియో బాగా వైరల్​ అయింది. ఒక స్విమ్మింగ్​ పూల్​లో తలకిందులుగా క్యాట్​వాక్​ చేసుకుంటూ వెళ్లిన క్రిస్టినా, డైవ్​ కొట్టి అడుగున్న ఉన్న బ్యాగ్​ అందుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత దాన్ని భుజానికి తగిలించుకొని క్యాట్​వాక్​ చేస్తూ వెళ్తుంది. ఈ వీడియోకు ఇప్పటికి సుమారు 20లక్షల లైక్​లు వచ్చాయి. అలాగే క్రిస్టినాను పొగుడుతూ బోలెడు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్​.