హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొట్టడంతో మహిళ మృతి

హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొట్టడంతో మహిళ మృతి

 బైక్ ఎక్కేందుకు రోడ్డు పక్కన నిలబడిన మహిళను వేగంగా దూసుకొచ్చిన  ఓ కారు ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో కవిత అనే మహిళ మృతి చెందింది. ఈ  దారుణ ఘటన హనుమకొండ జిల్లా కాజిపేట్ లో 2023, నవంబర్ 30వ తేదీ గురువారం చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. కాజిపేట్ సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న కవితను TS03 FA9881 నెంబర్ గల కారు ఢీకొట్టింది.

తీవ్రంగా గాయపడిన మహిళ  అక్కడికక్కడే మృతి చెందింది.  ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కారు ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎక్సయిజ్ సిఐ శరత్ కొడుకు వంశీగా తెలుస్తోంది. నిన్నటి నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం చేయడం లేదని, పోలీస్ అధికారి కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఫాతిమా నగర్ జంక్షన్ లో ధర్నాకు దిగారు.