
మంచిర్యాలలో విషాదం చోటు చేసుకుంది... పట్టణంలోని మాతాశిశు ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో బాలింత మృతి చెందింది. బుధవారం ( ఆగస్టు 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల పట్టణంలోని వికాస్ నగర్ కు చెందిన దూలం సోనీ పురిటి నొప్పులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది. పరిస్థితి విషమించడంతో సమీపంలోని మాతాశిశు ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో సోనీ పరిస్థితి మరింత విషమించడంతో అక్కడి వైద్యులు సోనీకి ఆపరేషన్ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చిన సోనీకి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆపరేషన్ తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో సోనీ మరణించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికే సోనీ మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
►ALSO READ | భర్త హత్యకు భార్య స్కెచ్ ..సజీవంగా పాతిపెట్టాలని చూస్తుండగా..షాకింగ్ ట్విస్ట్
సోనీ మరణానికి ఆసుపత్రి వైద్యులే కారణమని ఆరోపిస్తున్నారు బంధువులు. వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు బంధువులు. బంధువుల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించారు మృతురాలి బంధువులు.