కన్యత్వ పరీక్షలో ఫెయిల్.. విడాకులిస్తూ తీర్పు

కన్యత్వ  పరీక్షలో ఫెయిల్.. విడాకులిస్తూ తీర్పు

కొల్హాపూర్: కన్యత్వ పరీక్షలో ఫెయిల్ అయ్యిందని భార్యను భర్త గెంటేసిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జరిగింది. వివరాలు.. కొల్హాపూర్ లో కంజర్ భట్ కులానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అదే కమ్యూనిటీకి చెందిన ఇద్దరు అన్నాదమ్ముళ్లకు గతేడాది నవంబర్ లో పెళ్లి జరిగింది. వివాహం తర్వాత ఇరు వధువులకు వరుడి కుటుంబీకులు కులాచారం ప్రకారం కన్యత్వ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఒక వధువు ఫెయిల్ అయ్యింది. దీంతో పెళ్లి కొడుకు ఫ్యామిలీ పరీక్షలో ఫెయిల్ అయిన వధువుతోపాటు ఆమె సోదరిని కూడా ఇంటి నుంచి గెంటేశారు. ఈ విషయం మీద కుల పెద్దలతో పంచాయతీ పెట్టగా.. ఇద్దరు వధువులకు తమ భర్తల నుంచి విడాకులు ఇస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.