జగిత్యాల టౌన్, వెలుగు: బురఖా ధరించి ఓ జ్యువెల్లరీ షాప్‌కు వచ్చిన మహిళ గోల్డ్రింగ్చోరీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల టవర్ సర్కిల్ లోని రాగి శ్రీకాంత్ జ్యువెల్లరీ దుకాణానికి ఆదివారం బురఖాలో ఓ మహిళ వచ్చింది. ఖరీదైన ఉంగరాలు చూపించమని కోరింది.
సిబ్బంది కొన్నింటిని ఆమె ముందు ఉంచగా.. వాటిని పరిశీలిస్తున్నట్లే చేసి, వెంట తెచ్చుకున్న నకిలీ రింగును అక్కడ పెట్టి, గోల్డ్ రింగ్ ను ఎత్తుకెళ్లింది. కాసేపటికి గుర్తించిన సిబ్బంది యజమాని అఖిల్‌కు సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీలో నిందితురాలి దృశ్యాలు కనిపించాయి.
