ముక్కుకు సర్జరీ చెయ్యమంటే చెవి కట్ చేసిండ్రు

ముక్కుకు సర్జరీ చెయ్యమంటే చెవి కట్ చేసిండ్రు

ఐదేళ్ల క్రితం ఓ యువతికి తన ముక్కులోని ఎముక పక్కకు ఒరిగినట్లు డాక్టర్లు చెప్పారు. సర్జరీ చేస్తే సరిపోతుందన్నారు. కానీ అప్పుడు ఆపరేషన్ చేయించుకునే ఆర్ధిక స్తోమత లేక అలాగే వదిలేసింది. ఐదేళ్ల తరువాత అంటే కొద్దిరోజుల క్రితం సదరు యువతి తన ముక్కుకు ఆపరేషన్ చేయండంటూ ఓ ఆస్పత్రి వైద్యుల్ని సంప్రదించింది. అన్నీ టెస్ట్ లు చేసి యువతికి ఆపరేషన్ చేశారు. అని అనుకుంటే పొరబడినట్లే. ముక్కకు ఆపరేషన్ చేయమంటే చెవికి చెందిన కొంతభాగాన్ని కట్ చేసి ఆపరేషన్ చేశారు. దీంతో డాక్టర్ల నిర్వాకంపై యువతి లబోదిబోమని మొత్తుకుంటుంది.

చైనాకు చెందిన 31ఏళ్ల జావో  ఏంజెల్ వింగ్ హాస్పిటల్ లో ముక్కుకి ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వెళ్లింది. కానీ బాధితురాలి  ముక్కుకి ఆపరేషన్ అయితే చెవికి ఏదో అయినట్లు ఫీలైంది. ఆపరేషన్ చేయించుకున్న నాలుగు రోజుల తరువాత..బాధితురాలు తన చెవిని చెక్ చేసుకోగా.. చెవి  కట్ చేసి ఉండడంతో షాక్ కి గురైంది. ముక్కుకి ఆపరేషన్ చేయమంటే చెవిని ఎలా కట్ చేస్తారంటూ ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అనుమతి లేకుండా చెవి భాగాన్ని తొలగించారంటూ మీడియాను ఆశ్రయించింది. దీంతో జావో తీరుతో దిగొచ్చిన యాజమాన్యం  రినోప్లాస్టీ విధానం ద్వారా ఆపరేషన్ చేసినట్లు చేతులు దులుపుకున్నారు డాక్టర్లు.