కరోనా వైరస్ మనుషులుపైనే కాకుండా మూగ జీవాలపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఓ మనిషి నుంచి పిల్లికి కరోనా వైరస్ సోకింది.
మెట్రో కథనం ప్రకారం.. యుకే బెల్జియంలోని వలోనియా లీజ్ అనే ప్రాంతంలో నివసిస్తున్న వెటర్నరీ ఫ్యాకల్టీ పనిచేస్తున్న ఓ మహిళ నుంచి పిల్లికి కరోనా సోకిందని, ప్రస్తుతం ఆ పిల్లి కోలుకుంటుందని వైరాలజిస్ట్ ప్రొఫెసర్ స్టీవెన్ వాన్ స్థానిక మీడియాకు వెల్లడించారు. ఓ పిల్లి విరేచనాలు, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో యజమాని వైద్యుల్ని సంప్రదించినట్లు.. పిల్లి మలాన్ని టెస్ట్ చేయగా ఆ పిల్లికి కరోనా సోకినట్లు నిర్ధారించినట్లు యుకే ఫుడ్ ఛైన్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్ మెంట్ బాడీ (ఎఫ్ పిఎస్) అధికారులు తెలిపారు.
పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురైతే కాల్ చేయండి
పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురైతే తమని సంప్రదించాలని బెల్జియం అధికారులు కోరుతున్నారు. అంతేకాదు కరోనా వైరస్ వల్ల పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికి నేషనల్ కౌన్సిల్ ఫర్ యానిమల్ ప్రొటెక్షన్ సభ్యులు కరోనా వల్ల పెంపుడు జంతువుల్ని దూరం చేయద్దంటూ సలహా ఇస్తున్నారు.
