వీడియో: నన్ను నా భర్తతో పాటే దహనం చేయండంటూ షాపింగ్ మాల్‌పై నుంచి దూకిన నవవధువు

వీడియో: నన్ను నా భర్తతో పాటే దహనం చేయండంటూ షాపింగ్ మాల్‌పై నుంచి దూకిన నవవధువు

పెళ్లై 15 రోజులే అయింది.. కొత్త కాపురం.. కొత్త జీవితం.. ఎన్నో కలలతో తమ కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ నవదంపతుల ఆశలు 15 రోజులకే ఆవిరయ్యాయి. ఆక్సిడెంట్ రూపంలో భర్త మరణించగా.. అది తట్టుకోలేక భార్య బిల్డింగ్ పైనుంచి దూకింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. ఉజ్జయినికి చెందిన ఓ కొత్తజంటకు పెళ్లై 15 రోజులైంది. వరుడు కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆ వరుడు బుధవారం ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. పుట్టింట్లో ఉన్న వధువుకు ఈ విషయం తెలియడంతో.. తండ్రితో కలిసి ఉజ్జయినికి బయలుదేరింది. ఇండోర్‌లో  వీరు జ్యూస్ తాగడానికి ఆగారు. అంతలోనే వధువు అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. భర్త మరణాన్ని తట్టుకోలేని వధువు విజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సి -21 షాపింగ్ మాల్‌కు వెళ్లింది. అక్కడ మూడో అంతస్తుకు చేరుకోని కిందికి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వధువు దూకడాన్ని గమనించిన కొంతమంది వ్యక్తులు ఆమెను కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వారు వెళ్లేలోపు వధువు పైనుంచి కిందపడింది. వెంటనే మాల్ ఉద్యోగులు ఆమెను చికిత్స కోసం దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్యాగులో చూడగా ఒక సూసైడ్ నోట్ లభించింది. తనను కూడా తన భర్తతో పాటే దహనం చేయాలని కోరుతూ నోట్ రాసింది. ఆ నోట్ చూసి వారంతా షాక్ అయ్యారు. అదేవిధంగా బ్యాగులో ఉన్న ఆమె ఫోన్‌లో తండ్రి ఫోన్ నెంబర్ కనిపించింది. వెంటనే ఆయనకు ఫోన్ చేయగా.. తాను తన కూతురుతో కలిసి ఎయిర్‌పోర్టుకు వచ్చానిని.. అంతలోనే తన కూతురు కనిపించకుండా పోయిందని ఆయన అన్నారు.

శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని మాల్ ఉద్యోగి సలీం ఖాన్ తెలిపారు. ‘మేమంతా మా పనిలో బిజీగా ఉన్నాం. అప్పుడు అకస్మాత్తుగా అరుస్తున్న శబ్దం వచ్చింది. మూడవ అంతస్తులో ఒక అమ్మాయి నిలబడి దూకడానికి ప్రయత్నిస్తున్నట్లు మేం చూశాం. మేమంతా శబ్దం చేస్తూ ఆమెను ఆపడానికి ప్రయత్నించాము. ఇద్దరు వ్యక్తులు ఆమెను అందుకోవడానికి ప్రయత్నించేలోపే ఆ అమ్మాయి దూకింది. వెంటనే మేం ఆమెను ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. ఆమె తలకు మరియు కాలికి గాయమైంది. ఆమె ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం’ అని తెలిపాడు. వధువు తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఆర్ కుమ్రావత్ తెలిపారు.

For More News..

తెలంగాణలో మరో 2,278 కరోనా కేసులు

గొడవలొద్దు.. బార్డర్‌‌‌‌లో టెన్షన్స్ తగ్గించుకుందాం

రాష్ట్రాలు సెంటర్‌‌‌‌ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ పాటించాల్సిందే