ప్రేమించుకున్న అమ్మాయిలు: దూరం పెడుతుందంటూ సూసైడ్

ప్రేమించుకున్న అమ్మాయిలు: దూరం పెడుతుందంటూ సూసైడ్

ఇద్దరు అమ్మాయిల మధ్య చిగురించిన ప్రేమ విషాదాంతమైంది. కొంత కాలంగా ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో ఉన్నారు. ఐతే… 6 నెలలుగా ఇద్దరి మధ్య కొంత దూరం పెరిగింది. కావాలనే తనను ఆ అమ్మాయి దూరం పెడుతోందంటూ మనస్తాపంతో మరో అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెలితే..  హైదరాబాద్, నారాయణగూడ లోని ఓ ప్రైవేట్ హస్టల్ లో ఇద్దరు అమ్మాయిలు ఉంటున్నారు. వీరు దగ్గరలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. వీరు గత కొంత కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే గత ఆరు నెలలుగా వీరిద్దరు దూరంగా ఉన్నారు. శనివారం డిగ్రీ పరీక్షలు మొదలవడంతో ఈ ఇద్దరు అమ్మాయిలు ఎదురు పడ్డారు. ఇందులో ఒక అమ్మాయి తనను ఎందుకు దూరం పెడుతున్నావని మరో అమ్మాయిని పరీక్షా సెంటర్ దగ్గరే ప్రశ్నించింది. దీంతో పాటు.. క్షణికావేశంలో తనతో తెచ్చుకున్న స్మోల్ హెయిర్ డై తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే నారాయణగూడ పోలీసులు ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచారు.