రీల్స్ పిచ్చి ముదిరిపోతోంది. రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, బస్ స్టేషన్లు, రష్ గా ఉండే రోడ్లు, సిగ్నల్స్, బీచ్ లు రీల్స్ చేసే స్పాట్లుగా మారిపోతున్నాయి. తమలో ఉన్న టాలెంట్ ను చాటుకోవాలనే తపన..సెలబ్రిటీలుగా గుర్తింపు పొందాలనే కోరికతో.. యువత ఎటువంటి సాహసాలకైనా సిద్దపడుతున్నారు. రీల్స్ మోజులో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. యువతే కాదు.. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు రీల్స్ చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. రీల్స్ చేయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తమ టెలెంట్ ను ప్రపంచానికి చూపించాలని ఆరాట పడుతున్నారు. వీరి కోరిక బాగానే ఉందిగానీ..ఎక్కడిపడితే అక్కడ రీల్స్ చేయడమనేది తోటి వారికి ఇబ్బందిగా మారుతోంది. కొన్నికొన్ని సందర్భాల్లో ఈ రీల్స్ పిచ్చితో చేసే వింత చేష్టలకు నెటిజన్లకు చిరాకు తెప్పిస్తున్నాయి.
తాము చేసే రీల్స్ కు లైకులు, వ్యూస్ రావాలని యువత ఎటువంటి పనులకైనా సిద్ధపడుతున్నారు. ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు. ట్రైన్ లోంచి దూకడం.. రన్నింగ్ లో ఉన్న బస్సు కింద దూరడం.. అర్థనగ్న డ్యాన్సులు, టెమ్టింగ్ చేసే బెల్లి డ్యాన్సులు, పబ్లిక్ కిస్సింగ్స్ ఇలా దేనికైనా తెగించి రీల్స్ చేస్తున్నారు. రీల్స్ చేయడం ద్వారా టాలెంట్ ను ప్రపంచానికి చూపించి సెలబ్రీటీలుగా మారినవారుకొందరైతే.. లక్షల్లో ఫాలోవర్లును సంపాదించుకుని మంచి ఆదాయం పొందుతున్నవారు ఇంకొందరు. వీరిలో చాలామంది ప్రమాదాల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఏదీ ఏమైనా రీల్స్ చేసేవారు.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. ఇతరులకు ఇబ్బంది లేకుండా తమ టాలెంట్ ను ప్రపంచానికి చూపించడం తప్పేమి కాదంటున్నారు సోషల్ మీడియాలో రీల్స్ చూసినవారంతా..
తాజాగా ఓ యూట్యూబర్ అలియా.. కొత్త పెర్మార్మెన్స్ తో రీల్స్ చేసింది. ముంబైలో ఐకానిక్ ప్లేస్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ ఆవరణలో బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలియా పింక్ కలర్ బ్లౌజ్ , స్కర్ట్ వేసుకుని హిందీలో ఫేమస్ సాంగ్ Kagaz Kalam Davaat సాంగ్ కి బెల్లి డ్యాన్సు చేసింది. అలియా డ్యాన్స్ కు అక్కడున్నవారు కొంతమంది ఫిదా అయ్యారు. కొంతమంది ఏంటీ న్యూసెన్స్ అన్నట్లుగా మొహం తిప్పుకున్నారు. వెళ్తు్న్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
అలియా లేటెస్ట్ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్టు.. కామెంట్లు, ఎమోజీలో ముంచెత్తారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం పబ్లిక్ ప్లేసుల్లో ఇలా బెల్లి డ్యాన్సులు చేయడమేంటీ.. వెంటనే ఇటివంటి వాటిని బ్యాన్ చేయాలని మండిపడుతున్నారు.