కెమెరా కళ్లతో చూస్తుంది!

 కెమెరా కళ్లతో చూస్తుంది!

పుట్టుకతోనే ఆమెకు కళ్లు కనిపించవు. అలాగని జీవితంలో ఏదీ సాధించలేనని, తను ఏమీ చేయలేనని అనుకోలేదు. చదువుకునే రోజుల నుంచే మాస్​ మీడియా కోర్స్​ చేయాలనుకుంది. ఫొటోగ్రఫీ మీద ఇష్టం పెంచుకుంది. ఆమె అనుకున్నట్టే ఇప్పుడు కెమెరా కళ్లతో లోకాన్ని చూస్తున్న ఆమె పేరు ఇస్రా ఇస్మాయిల్​. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా సిటీలో ఉంటోంది. 
రోజూ కెమెరా పట్టుకొని టూరిస్టులు ఉండే ప్లేస్​లకి వెళ్తుంది నస్రా. అక్కడ ఉన్నవాళ్లతో మాట్లాడి, ‘ఫొటో తీయించుకుంటారా?’ అని అడుగుతుంది. వాళ్లు ‘ఓకే’ అనగానే.. వాళ్లు  ఎంత దూరంలో నిల్చోవాలో చెప్తుంది. ఫొటో తీయడం పూర్తయ్యేవరకు వాళ్లని తనతో మాట్లాడుతూ ఉండమని చెప్తుంది. ఫొటో తీసిన తర్వాత వాళ్లకి చూపిస్తుంది. ఫొటో దిగేవాళ్ల మాటలు విని, వాళ్లను ముట్టుకొని ఫొటోలు తీస్తుంది. అలాగని ఆమె ర్యాండమ్​ స్నాప్స్​ తీస్తుంది అనుకుంటున్నారేమో. లెన్స్​ని అడ్జస్ట్​ చేస్తూ, పర్ఫెక్టుగా ఫొటోలు తీస్తుంది. అందుకే ఒకసారి నస్రాతో ఫొటో తీయించుకున్నవాళ్లు మళ్లీ ఆమెతో ఫొటో తీయించుకోవాలని అనుకుంటారు. చూపు లేకుంటేనేం, ప్రపంచాన్ని అందంగా కెమెరాలో బంధించే టెక్నిక్​ ఉందామెకు. అందుకే చూపు లేదని బాధపడే ఎంతోమందికి ఇన్​స్పిరేషన్ నస్రా.  
జర్నలిజంలో కెరీర్​
‘‘నాకు మాస్​ మీడియా కోర్సు చేయాలని ఉండేది. అందుకే కెమెరా పట్టుకున్నా. కాలేజీలో ఫొటోగ్రఫీ కోర్సులో చేరా. ఖలీద్ ఫరీద్​ అనే ప్రొఫెసర్​ కెమెరాతో ఫొటోలు తీయడం నేర్పించాడు. స్మార్ట్​ఫోన్​తో కాకుండా డైరెక్ట్​గా కెమెరాతో ఫొటోలు తీయడం నేర్చుకున్నా. మొదట్లో కష్టమనిపించేది. ఏ ప్రొఫెషన్​ అయినా చేయడం అంత ఈజీ ఏం కాదు. పైగా నాకు ఇష్టమైన పని చేస్తున్నందుకు చాలా తృప్తిగా ఉంది. జర్నలిస్ట్​ అవ్వాలనేది నా డ్రీమ్” అంటోంది ఈ యంగ్​ ఫొటోగ్రాఫర్​ నస్రా.