
మహారాష్ట్రలోని పూణెలో 38 ఏళ్ల ఓ వ్యక్తి తన పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి తనను దుబాయ్‌కు తీసుకెళ్లినందుకు మనస్తాపం చెంది భర్త ముఖంపై కొట్టడంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. వాన్‌వాడి ప్రాంతంలో నవంబర్ 24న మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు వారు చెప్పారు. మృతుడు నిఖిల్ ఖన్నా రియల్ ఎస్టేట్ డెవలపర్ అని పోలీసులు తెలిపారు.
రేణుక అనే మహిళ పుట్టిన రోజు సెప్టెంబర్ 18 అని, ఆ రోజును ఆమె దుబాయ్‌లో జరుపుకోవాలని భావించిందని, కానీ ఆమె భర్త తన డిమాండ్‌ను నెరవేర్చలేదని విచారణలో తేలినట్టు వాన్‌వాడికి చెందిన ఓ పోలీస్ అధికారి చెప్పారు. అంతేకాకుండా, ఈ జంట నవంబర్ 5న వారి వివాహ వార్షికోత్సవం కూడా ఉంది, ఈ రోజున ఆమె తన భర్త ఏదైనా మంచి బహుమతి ఇస్తాడని ఆశించిందని, అది కూడా కాలేదని, తన బంధువుల పుట్టినరోజు కోసం ఢిల్లీ వెళ్లాలని భావించిన ఆ మహిళ కలత చెందిందనన్నారు.
ఈ విషయమై నవంబర్ 24న దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంతో ఆ మహిళ తన భర్త ముక్కుపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోయాడని అధికారులు తెలిపారు. అనంతరం ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని సాసూన్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనలో మహిళ తన పిడికిలితో తన భర్తను కొట్టిందా లేదా ఏదైనా వస్తువుతో కొట్టిందా అనే విషయంపై విచారణ జరుగుతోందని, శవపరీక్ష తర్వాతే మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకున్నామని, కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ కేసులో ఆమెపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.