దీపికా సాంగ్ కు రీక్రియేషన్.. డ్యాన్స్ స్టెప్స్ కు నెటిజన్స్ ఫిదా

దీపికా సాంగ్ కు రీక్రియేషన్.. డ్యాన్స్ స్టెప్స్ కు నెటిజన్స్ ఫిదా

చాలా ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాలు ముగిసినప్పటికీ కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా అంతే ఉత్సాహంగా సాగుతున్నాయి. అందులో భాగంగా కొందరు బాలీవుడ్ లో ఫేమస్ సాంగ్స్ ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుండడం చూస్తూనే ఉంటాం. దీపికా పదుకొణె - రణవీర్ సింగ్‌ నటించిన రాస్లీలా రామ్-లీలాలోని డోల్ భాజే సాంగ్ ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా ఓ యువతి ఈ సాంగ్ ను రీక్రియేట్ చేసి, తన స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో ఓ యువతి.. బ్యాగ్రౌండ్ లో వస్తోన్న దీపికా స్టెప్పుల తరహాలోనే అలరించింది. ఈ వీడియో ఇప్పటివరకు 8లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకోగా.. వేలల్లో లైక్స్ వచ్చాయి. వావ్... ఎంత అద్భుతమైన నృత్యం అంటూ ఆమెను ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు.

ప్రముఖ చిత్రనిర్మాత సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా చిత్రంలోనిది ఈ పాట. 2013లో ఈ సినిమా విడుదల కాగా ఇందులో సుప్రియా పాఠక్, శరద్ కేల్కర్, రిచా చద్దా తదితరులు కూడా నటించారు. ఈ చిత్రంలో మొదటిసారి రణవీర్ సింగ్, దీపికా పదుకొణెలు కలిసి నటించారు. ఆ తరువాత, ఈ ఇద్దరూ కలిసి ఇదే చిత్రనిర్మాతతో కలిసి బాజీరావ్ మస్తానీ, పద్మావత్‌లో నటించి బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by kreethi (@_.kretx_.k)