ఆన్ లైన్ లో మనీ ఎర్నింగ్ చేయాలని ట్రై చేస్తున్నారా

ఆన్ లైన్ లో మనీ ఎర్నింగ్ చేయాలని ట్రై చేస్తున్నారా

లాక్ డౌన్ టైంలో ఇంట్లో కూర్చొని గోళ్లు గిల్లుకునే బదులు ఆన్ లైన్ లో మనీ ఎర్నింగ్ చేయాలని ట్రై చేస్తున్నారా..? అయితే ఒక్క నిమిషం. ఆన్ లైన్ లో ఎటువంటి చార్జెస్ లేకుండా మనీ ఎర్న్ చేయోచ్చు. కానీ రిజిస్ట్రేషన్ల పేరుతో పెద్దమొత్తంలో చెల్లిస్తే వేలకు వేలు మనీ ఎర్న్ చేయోచ్చు అని ఎవరైనా ఆశచూపితే ఆలోచించండి. అలా ఆలోచించకుండా రిజిస్ట్రేషన్ల పేరుతో పెద్ద మొత్తంలో చెల్లించిన ఓ యువతి మోసపోయింది.

ముంబైలోని ఘట్కోపర్‌లో  ఆస్మా(23) అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేస్తుంది. లాక్ డౌన్ తో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఆస్మా ఆన్ లైన్ లో మనీ ఎర్న్ చేయాలని గూగుల్లో వెతికింది. దీన్ని క్యాష్ చేసుకునే రాహుల్ అహూజా ఆమెకు తారసపడ్డాడు. రాహుల్ పేరుతో ఉన్న ఓ లింక్ ను ఓపెన్ చేయగా నెలకు రూ.40వేల నుంచి రూ.50వేలు సంపాదించండంటూ ఊరించాడు.
ఇంకేం 40వేలు,50వేలు సంపాదించుకోవచ్చనుకుంటూ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుంది. అప్పుడే రాహుల్ రంగంలోకి దిగాడు. రిజిస్ట్రేషన్ కోసం రూ.2వేలు, వెరిఫికేషన్ టీమ్ కు రూ.6వేలు చెల్లించాలని చెప్పాడు. దీంతో మనీ పేటీఎం చేసింది. పేటీఎం చేసిన తరువాత బాధితురాలి డిటెయిల్స్ తీసుకున్నాడు. అనంతరం ఇంటర్య్వూ మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యింది. జాబ్ వచ్చినట్లే..ఫైనల్ వెరిఫికేషన్  కోసం రూ.10000 చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. మళ్లీ ఎందుకూ… ఆల్రెడీ ఇప్పటికే రూ.8000 ఇచ్చాను కదా అంటే… ఇక లైఫ్ లాంగ్ మనీ అడిగేది ఉండదనీ… నెలకు తప్పనిసరిగా రూ.40000కు తగ్గకుండా వస్తాయి కాబట్టి… ఇప్పుడు చెల్లించిందంతా ఒకే నెలలో రిటర్న్ వచ్చేస్తుందని ఆశ పెట్టాడు. సరే అని మరో రూ.10000 కూడా చెల్లించింది. అనంతరం వర్క్ చేసేందుకు ప్రయత్నించగా ఎర్రర్ చూపించింది. నిందితుడికి కాల్ చేస్తే కలవడం లేదు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు  పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.