పెళ్లి డీజేలో ఫైట్: భర్తను కాపాడబోయి.. మహిళ మృతి

పెళ్లి డీజేలో ఫైట్: భర్తను కాపాడబోయి.. మహిళ మృతి

న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలో డీజే విషయంలో కొట్లాట.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నచ్చిన పాట కోసం ముగ్గురి మాటల యుద్ధం చివరికి తుపాకీతో కాల్పుల దాకా వెళ్లింది. బుల్లెట్ తన భర్తకు తగలకుండా కాపాడుకోవలన్న తపనలో అడ్డుపడ్డ భార్య తన ప్రాణాలను కోల్పోయింది. ఢిల్లీలోని మంగోల్పురి ప్రాతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు నిందితులను శనివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

శుక్రవారం రాత్రి బాధిత మహిళ సునీత (32) మేనల్లుడి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా డీజే ఏర్పాటు చేశారు. అయితే నచ్చిన పాట కోసం సునీత భర్త సజ్జన్, బంధువులు ఆకాశ్, సందీప్ మధ్య గొడవ మొదలైంది. మాటా మాటా పెరిగి.. కొట్లాటకు దిగారు. ఈ సమయంలో నిందితుల్లో ఒకరు తుపాకీ తీసి కాల్చబోయారు. దీంతో ఎక్కడ తన భర్త సజ్జన్ కు బుల్లెట్ తగులుతుందోనని సునీత పరుగున వెళ్లి అడ్డుపడింది. దీంతో బుల్లెట్ ఆమె తగిలింది. దీంతో బంధువులంతా ఎక్కడ తమపై దాడికి దిగుతారోనన్న భయంతో ఆకాశ్, సందీప్ పరారయ్యారు.

అయితే సునీతను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టి.. చండీగఢ్ లో శనివారం అరెస్టు చేశారు.