
చాలా మంది ఇంట్లో పామును చూస్తే అరుస్తారు లేదా పారిపోతారు. కానీ పూణేకు చెందిన ఈ 70 ఏళ్ల శకుంతల సుతార్ అనే బామ్మ ఎవ్వరు ఊహించని పని చేసింది. పాము అంటేనే కాటేస్తుందేమో అని వణుకు పుడుతుంది. కానీ ఆమె ధైర్యంగా దానిని చేతులతో పట్టుకొని మెడలో వేసుకుంది. అవును ఇది నిజమే.
వివరాల చూస్తే పూణేలోని కాసర్ అంబోలి గ్రామానికి చెందిన ఓ బామ్మా చేసిన సాహసమైన వీడియో వైరల్ కావడంతో ఇంటర్నెట్లో తెగ షేర్ అయ్యింది. ఆమె సాహసానికి కారణం ? పాముల గురించి అవగాహన కల్పించడం అలాగే భయాలు పోగొట్టడం..
ఇదంతా పాము ఆమె ఇంట్లోకి వచ్చాక జరిగింది. పాము అనగానే అస్సలు భయపడకుండ, అరకుండ, ఎవరి సహాయం తీసుకోకుండా స్వయంగా ఆమెనే పామును పట్టుకుని చుట్టుపక్కల వారికి చూపించింది. వీడియోలో ప్రజలు షాక్‌తో చూస్తుండగానే ఆమె తన మెడలో పామును వేసుకుంది. అయితే మీరు పామును చూసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి పాము విషపూరితమైనది కాదు. నిజానికి ఈ పాము ఎలుకలను తింటుంది. ప్రజలు ఎక్కువగా భయం, మూఢనమ్మకాలతో పాములను చంపుతారు, ఇది తప్పు అని చెప్పింది. అయితే ఆమె పట్టుకున్న పాము చిన్నది కాదు చాల పెద్దది.
►ALSO READ | ఆపరేషన్ సిందూర్పై చర్చ సమయంలోనే.. పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం.. పూర్తి డీటైల్స్
శకుంతల సుతార్ బామ్మా ధైర్యం, సాహసానికి దేశవ్యాప్తంగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. 70 ఏళ్ల వయసులో కూడా ఆమె పాముల పట్ల అవగాహన కల్పిస్తుంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోకు భారీగా లైక్‌లు, వ్యూస్, కామెంట్‌లు వచ్చాయి.
🐍💪 70 साल की उम्र में भी हौसला जवान!
— Satyaagrah (@satyaagrahindia) July 27, 2025
पुणे के मुलशी तालुका के कासर अंबोली गाँव की शकुंतला सुतार दादी ने जो किया, वो किसी फिल्मी सीन से कम नहीं।
जब उनके घर में धामन सांप निकला, तो दादी ने
ना डर दिखाया
ना हंगामा किया
बल्कि बिना घबराए साँप को खुद पकड़ा
और गले में डालकर लोगों को… pic.twitter.com/eKuoKCntat