
జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం చిల్వా కోడూరు వద్ద కారు, బైక్ ఢీ ఎదురెదురుగా ఢీకొట్టడంతో మహిళ ఎస్సై అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో బైక్ పై వస్తున్న యువకుడు కూగా మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ఘటనకు కారణం అని పోలీసులు తెలిపారు.
ఎస్సై శ్వేత కారులో ధర్మారం వైపు నుండి జగిత్యాల వస్తున్న సమయంలో అదుపుతప్పతి కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్సైతో పాటు యువకుడు అక్కడిక్కడే మృతి చెందారు.
విధుల్లో భాగంగా జగిత్యాల వెళ్తున్న ఎస్సై కొక్కుల స్వేత సొంతంగా కారు డ్రైవ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టి, ఆ తర్వాత చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది.
ఎస్సై స్వేత ప్రస్తుతం జగిత్యాల ఎస్పీ ఆఫీస్ డీసీఆర్బి లో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో జిల్లాలోని పలు స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు.