అయ్యో అయ్యో అయ్యయ్యో.. పాపం అమ్మాయి.. హెల్మెట్ ధరించి అడ్డంగా బుక్కైంది.. వీడియో చూస్తే నవ్వాగదు..!

అయ్యో అయ్యో అయ్యయ్యో.. పాపం అమ్మాయి.. హెల్మెట్ ధరించి అడ్డంగా బుక్కైంది.. వీడియో చూస్తే నవ్వాగదు..!

సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనల్ని కళ్లు తిప్పుకోనివ్వవు. మరికొన్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. తాజాగా ఒక  వీడియో  సోషల్ మీడియాను ఊపేస్తోంది. కొన్ని కొన్నిసార్లు మనం చేసే పనులు ప్రపంచాన్ని మనవైపు చూసేలా చేస్తాయి. అలాంటి సీన్ ఓ అమ్మాయి విషయంలో చోటు చేసుకుంది. అయితే, ఇది చాలా ఫన్నీగా ఉంది. చూసేందుకు పాపం అనిపించినా.. ఆ అమ్మాయి చేసిన పని నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న ఫన్నీ  వీడియోలు@ThebestFigen అనే ట్విట్టర్ ఖాతాలో  ఒక ఫన్నీ వీడియో ట్వీట్ చేయబడింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో (Woman Sit on Bike Funny Video) ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి బైక్ పై కూర్చొని ఉంది.  ఈ రోజుల్లో బైక్ పై ప్రయాణించేటప్పుడు సేఫ్టీ కోసం హెల్మెట్ ధరిస్తారు.  అలానే బైక్ పై ఉన్న ఇద్దరూ హెల్మెట్ పెట్టుకున్నారు.  ఇప్పుడు అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.  ఏంటి ఈ వార్త ఎలా వైరల్ అయింది అనుకుంటున్నారా.. ఆ మహిళ పెట్టుకున్న హెల్మెట్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు పగలబడి నవ్వాల్సిందే.  

కొలంబాయాలో ఓ ఇరుకైన మార్గంలో  వారు బైక్ పై వెళుతున్నారు. వీరు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.  అయితే ఆ మహిళ హెల్మెట్ ను రివర్స్ చేసి పెట్టుకుంది.    అంటే వెనుభాగం ముందుకు.. ముందు భాగం వెనుకకు ధరించింది.  ఈ సీన్ ను వారి పక్కనే  కారులో వెళుతున్న వారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఇక అంతే ఈ వీడియో వైరల్ కావడం.. కొద్ది సమయంలోనే 70 వేల మందికి పైగా వీక్షించారు.  అంతేనా మరి  ఈ వీడియోకు లైక్ లు, కామెంట్లు కూడా వచ్చాయి.  ఆ మహిళ హెల్మెట్ పెట్టుకొనేందుకు కొత్త పద్దతిని కనుగొన్నది అని కామెంట్ చేయగా.. మరొకరు ఆమెకు అదే సౌకర్యమేమో అని పోస్ట్ చేశారు.  ఈ వీడియోను  చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై ఓ లుక్కేసుకోండి.