ముంబై లోకల్ ట్రైన్ లో ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోయిన యువతి

ముంబై లోకల్ ట్రైన్ లో  ఐటమ్ సాంగ్ తో  రెచ్చిపోయిన యువతి

సోషల్ మీడియా వచ్చాక ఫేమస్ కావాలని రెచ్చిపోతున్నారు కొందరు యువతీ యువకులు. రీల్స్, షాట్స్ పేరుతో ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేస్తున్నారు.  మెట్రో స్టేషన్లు, బస్సులు, రోడ్లపైన పబ్లిక్ ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ మధ్య ఢిల్లీ మెట్రోలో ఇలాంటి వీడియోలు ఎన్నో చూశాం.  డ్యాన్స్ లు చేయడం వాటిని, ట్విట్టర్లు,ఫేస్ బుక్ లలో పోస్ట్ చేయడం తర్వాత పోలీసులు కేసు పెట్టడం ఇలాంటి ఘటనలు చాలానే చూశాం.

అయితే లేటెస్ట్ గా ముంబైలో లోకల్  ట్రైన్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువతి ట్రైన్ లో ఐటమ్ సాంగ్ కు బెల్లీ డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. శాండ్ హర్ట్స్ రోడ్, మస్జీద్ స్టేషన్ల మధ్య లోకల్  రైలులో యువతి డ్యాన్స్  చేస్తున్న ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

Also Read :- గణేష్ చతుర్థి విషెస్ చెప్పిన విజయ్ మాల్యా : ఎక్స్(X)లో కామెడీ పంచ్ లు

లోకల్ ట్రైన్‌లో అసభ్యకర రీతిలో బెల్లీ డ్యాన్స్ చేస్తున్నదని పలువురు కామెంట్‌ చేస్తు ముంబై పోలీసులకు ట్యాగ్ చేశారు.  యువతి డ్యాన్స్ పై పలువురు భిన్న రకాలుగా కామెంట్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో దిగజారుతున్న పరిస్థితికి ఈ వీడియో నిదర్శనమని మండిపడుతున్నారు. ఆయువతిని వెంటనే అరెస్ట్ చేయాలని.. అలా చేస్తే మరోసారి ఇలాంటి వీడియోలు చేయరని హెచ్చరిస్తున్నారు. ఇక  ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టిలో పడటంతో  ఆ యువతిపై చర్యలు తీసుకోవాలని  రైల్వే పోలీసులను కోరారు.