భర్త, ప్రియుడు ఇద్దరూ కావాలి.. కరెంట్ పోల్ ఎక్కి మహిళ నిరసన

 భర్త, ప్రియుడు ఇద్దరూ కావాలి..   కరెంట్ పోల్ ఎక్కి మహిళ నిరసన

ఆమెకు పెళ్లైంది. రత్నాలాంటి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మరోకరితో ప్రేమలో పడింది. చివరికి ఈ విషయం బయటికి తేలియడంతో తనకు ఇద్దరూ కావాలని పట్టుబట్టింది. అందుకు  ఇంట్లోవాళ్లు అంగీకరించకపోవడంతో  కరెంట్ పోల్ ఎక్కి నాకు ఇద్దరూ కావాలని నిరసన చేపట్టింది.  ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పుర్‌లో  చోటుచేసుకోగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

పిప్రాయిచ్‌ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల ఓ మహిళ తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు పక్క గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం ప్రేమగా మారి గత 7 సంవత్సరాలుగా తన భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే  ఈ విషయం  మహిళ భర్త రామ్ గోవింద్ కు తేలియడంతో నిలదీశాడు.  దీంతో దంపతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రియుడిని ఇంట్లోనే ఉండనివ్వాలని  అలాగైతే ఇంటి ఆర్థిక సమస్యలు కూడా తొలుగుతాయని భర్తను కోరింది. ఇందుకు అతడు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది.

ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉన్న కరెంట్ పోల్ ఎక్కి తనకు భర్త, ప్రేమికుడు ఇద్దరూ కావాలంటూ నిరసన వ్యక్తం చేసింది. దీంతో ఆమెను కిందికి దిగాలంటూ కుటుంబ సభ్యులు ప్రాదేయపడ్డారు.  కానీ ఆ మహిళ వినలేదు.  దీంతో స్థానికులు పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.  దీంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని బలవంతంగా ఆమెను కిందకు దించారు.

ALSO READ :- ఎండాకాలం దోమ కుట్టిందా.. వెంటనే ఇలా చేయండి.. లేకపోతే రోగాల బారిన పడతారు..!