సూట్ కేస్ లగేజీ ఓవర్ వెయిట్.. ఎయిర్ పోర్టులో యువతి ఐడియా వైరల్

సూట్ కేస్ లగేజీ ఓవర్ వెయిట్.. ఎయిర్ పోర్టులో యువతి ఐడియా వైరల్
  • రెండున్నర కేజీల డస్సులు వేసుకున్న జెల్
  • ఫేస్ బుక్ లో ఫొటో వైరల్.. 35 వేల లైక్స్

విమానంలో లో ప్రయాణించే వారికి సూట్ కేసులో తీసుకెళ్లే వస్తువుల బరువుపై లిమిట్ ఉంటుంది. ఫారెన్ వెళ్లేటప్పుడు ఓవర్ వెయిట్ అయితే ఏ వస్తువులు తీసేయాలో అప్పటికి అప్పుడు అర్థం కాదు. విదేశాల్లో చదువుకోవడానికో.. జాబ్ చేయడానికో వెళ్లే మన యువతకు చాలా మందికి ఎదురయ్యే ఇబ్బందే ఇది. దీని ఓ యువతికి స్పాట్ లో వచ్చిన ఐడియా సూపర్. లగేజీ ఓవర్ వెయిట్ చార్జీలు తప్పించుకునేందుకు ఎయిర్ పోర్టులో అప్పటికప్పుడు ఆమె చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

రెండున్నర కేజీల డ్రస్సులేసుకుంది

ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫారెన్ వెళ్లేటప్పుడు ఓవర్ వెయిట్ రాకుండా ఏం చేయాలా అని జట్టు పీక్కోవడం చాలామందే చూసే ఉంటారు. వృత్తిరీత్యా నర్సు అయిన ఫిలిప్పీన్స్ యువతి జెల్ రోడ్రిగజ్ చేసిన పని చూస్తే.. ఇక బుర్ర బద్ధలుకొట్టుకోరు! ఎయిర్ పోర్టులో చెకిన్ చేయడానికి వెళ్లినప్పుడు ఆమె సూట్ కేసు బరువు 9 కేజీలు ఉందని చెప్పారు సిబ్బంది. 7 కేజీలకు మించి ఉండడానికి లేదని, అలా ఉంటే ఎక్స్ ట్రా లగేజీ చార్జ్ కట్టాలన్నారు.

రెండు కేజీలకే అదనంగా డబ్బులు కట్టడం ఎందుకులే అనుకుందామె. ఏ మాత్రం తడువుకోకుండా సూట్ కేస్ ఓపెన్ చేసి.. దానిలోని డ్రస్సులు ఒకదానిపై ఒకటి వేసేసుకుంది. ఇలా ఏకంగా రెండున్నర కేజీల డ్రస్సులు వేసుకుంది జెల్. అలా జంబో డ్రస్ తో ప్రయాణం ముగించింది.

వేలల్లో లైకులు… షేర్లు

అలా జంబో డ్రస్ తో తీసుకున్న ఫొటోను ఆమె తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తన ఐడియాను కూడా రాసి, షేర్ చేసింది. అంతా ఆ పోస్టుకు ఇక లైకులే లైకులు. ఏకంగా వెయ్యి కామెంట్స్, 35 వేల లైకులు, 21 వేల షేర్లతో వైరల్ అవుతోంది. సూపర్ ఐడియా అంటూ కొందరు, దీనికి చార్జ్ లేదుగా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

when the airline staff at the check in counter said: “EXCESS NA PO KAYO, 7kg lang po allowed na hand carry.”me: NO PROBLEM! ?*from 9kg to 6.5kg baggage ?#ExcessBaggageChallengeAccepted

Posted by Gel Rodriguez on Tuesday, October 1, 2019