మాయ లేడి.. పోలీస్ భార్యనే మోసం చేసింది

మాయ లేడి.. పోలీస్ భార్యనే మోసం చేసింది

పోలీస్ భార్యనే దోచేసింది ఓ లేడి కిలాడి. ఈ సంఘటన ముంబయిలో మన్పాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఫేస్ బుక్ ద్వారా ఇంటి వద్ద ఉండే గృహిణులతో  స్నేహం చేస్తూ.. ఆ తర్వాత అదును చూసి వారి వద్ద ఉన్న నగదును కాజేసి ఉడాయించడమే ఈ మాయలేడి పని.

ఈ క్రమంలోనే ముంబై పరిసర ప్రాంతంలో నివాసముంటున్న విదిషా రాజ్యవర్ధన్ అనే పోలీస్ కానిస్టేబుల్ భార్యతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుందీ లేడి. ఆ తర్వాత తనను తాను సారికా షిండేగా పరిచయం చేసుకుంటూ.. మాటలు కలిపింది. కొంతకాలం తర్వాత విదిషా ఇంటికి రాకపోకలు కూడా సాగించింది.తాను కూడా ఓ కానిస్టేబుల్ అంటూ.. కాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సస్పెండ్ కు గురైనట్టు ఆ కానిస్టేబుల్ భార్య వద్ద సానుభూతి పొందింది. ఆమెను నమ్మించేందుకు ఓ నకిలీ ఐడీ కార్డు, కొన్ని ఫోటోలను కూడా చూపించింది.

ఈ నేపథ్యంలోనే ఓ సారి విదిషా ఇంటికి వెళ్లిన సారికా..  విదిషా కిరాణా షాపుకి వెళ్లిన సమయంలో తన ఇంట్లోని నగలు, మొబైల్ ఫోన్ ను దొంగిలించింది. ఈ సంగతి కనిపెట్టిన విదిషా కూతురు తన తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు ఆమె గురించి మరికొన్ని షాకింగ్ నిజాలు తెలిపారు. ఆమెపై  గతంలోనే పలు కేసులున్నాయని, మూడు పెళ్లిళ్లు చేసుకొని, ముగ్గురి భర్తలను నిలువు దోపిడి చేసిందని అన్నారు.  ఆమె మూడవ భర్త ఫిర్యాదుతోనే ఈ విషయాలన్ని తెలిశాయని మన్పాడ ఎస్సై నజీర్ కులకర్ణి తెలిపారు.

ప్రస్తుతం  ఆమెపై దొంగతనం కేసుతో పాటు ఛీటింగ్ కేసు కూడా నమోదు చేసి మాయలేడిని వెతికే పనిలో పడ్డారు,