రాష్ట్రం అత్యాచారాల తెలంగాణగా మారిపోయింది

రాష్ట్రం అత్యాచారాల తెలంగాణగా మారిపోయింది

రాష్ట్రం అత్యాచారాల తెలంగాణగా మారిపోయిందన్నారు మ‌హిళా కాంగ్రెస్ చీఫ్ నేరెళ్ల శార‌ద‌. ఇలాంటి ఘోరాలు అరికట్టాలన్న ఆమె..ఎన్ని చట్టాలు వచ్చినా…మహిళలకు రక్షణ లేకుండా పోతుంద‌న్నారు. కొత్తగా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆశించామని.. కానీ రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు, దాడులు ఆగడంలేదన్నారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఒక దళిత బాలిక తనపైన 139 మంది ఏళ్ల తరబడి అత్యాచారాలు చేసారని ఫిర్యాదు చేసిందని.. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేరెళ్ల శారద.

హైద్రాబాద్ లో ఒక బీజేపీ నాయకుడి కొడుకు ఒక దళిత అమ్మాయిని అత్యాచారం చేశారని.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్న ఆమె.. నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా కూడా మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ దొరకడం లేదన్నారు. ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణ విషయంలో గట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు నేరెళ్ల శార‌ద‌.