
హైదరాబాద్, వెలుగు: ఐఎంసీ లేడీస్ వింగ్ మహిళా ఎంట్రప్రెనార్ల ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దీనిని గత 38 సంవత్సరాలుగా ముంబైలో నిర్వహిస్తున్నామని, ఈ ప్రదర్శన ఇప్పుడు మొదటిసారిగా హైదరాబాద్‌కు రానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నెల 27, 28 తేదీలలో హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
దాదాపు 40 ఏళ్లుగా మహిళా ఎంట్రప్రెనార్ల ఎగ్జిబిషన్ మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో మేలు చేస్తోందని తెలిపింది. ఈ ప్రదర్శనలో దుస్తులు, ఆభరణాలు, ఉపకరణాలు, జీవనశైలి ఉత్పత్తులు, గృహ అలంకరణ వస్తువులను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొనుగోలుదారులు, అమ్మకందారులు, సందర్శకులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.