మాకు మహిళా ఎంట్రప్రెనూర్లే కీలకం

మాకు మహిళా ఎంట్రప్రెనూర్లే కీలకం

పది మందికి చేయూతగా నిలుస్తోన్న మహిళా ఎంట్రప్రెనూర్లు ఇప్పుడు ఇండియాలో కీలకంగా మారుతున్నారు. ఇండియాలో తమ ఫ్యూచర్ గ్రోత్‌‌కు మహిళా ఎంట్రప్రెనూర్లే కీలక పాత్ర పోషించనున్నట్టు అమెరికాకు చెందిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఆమ్వే చెప్పింది. ఆమ్వే గుర్తించిన నాలుగు మేజర్ మార్కెట్లలో ఇండియా ఒకటిగా ఉంది.  2029 నాటికి కోటి మంది ప్రజలను ఆరోగ్యకరంగా జీవించేలా చేయాలని టార్గెట్‌‌గా పెట్టుకున్న ఆమ్వేకు, ఇండియాలో 5.5 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లున్నారు. వారిలో సుమారు 60 శాతం మంది మహిళలే ఉన్నట్టు ఆమ్వే చెప్పింది. చైనా, అమెరికా, థాయ్‌‌లాండ్‌‌తో పాటు ఇండియా మాకు చాలా ముఖ్యమైన మార్కెట్‌‌గా ఉన్నట్టు ఆమ్వే గ్లోబల్ సీఈఓ మిలింద్ పంత్ చెప్పారు. తమ టాప్ 10 మార్కెట్లలో ఇండియాలో ఇప్పటికే ఒకటిగా ఉందన్నారు. ఇంజనీరింగ్ అండ్ కన్‌‌స్ట్రక్షన్ కంపెనీ ఎల్‌‌ అండ్ టీ కూడా వెల్డింగ్ టెక్నాలజీలో గ్రామీణ ప్రాంత మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ట్రెడిషనల్‌‌గా ఈ వర్క్‌‌స్పేస్‌‌లో మగవారే డామినేటెడ్‌‌గా ఉంటూ వస్తున్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ యునిక్ ప్రొగ్రామ్‌‌ను ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల్లో మహిళా విద్యార్థులకు టెక్నికల్ నైపుణ్యాలను ఈ ప్రొగ్రామ్ ద్వారా పెంచుతామని ఎల్ అండ్ టీ తెలిపింది. తొలి బ్యాచ్ కింద తొమ్మిది మంది యంగ్ ఉమెన్‌‌కు వెల్డింగ్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనున్నామని చెప్పింది. వీరి కలను సాకారం చేయనున్నట్టు చెప్పింది. ఈ ప్రొగ్రామ్‌‌ను భవిష్యత్‌‌లో మరింత విస్తరించనున్నామని వెల్లడించింది. ట్రైనింగ్ కరిక్యులమ్‌‌ను ఇండస్ట్రీల్లో ప్రస్తుత ప్రాక్టికల్ పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ చేస్తున్నామని ఎల్‌‌ అండ్ టీ చెప్పింది.