మొత్తం సభ్యుల్లో మహిళా ఎంపీలు 15 శాతం కన్నా తక్కువే

మొత్తం సభ్యుల్లో మహిళా ఎంపీలు 15 శాతం కన్నా తక్కువే

లోక్ సభలో మొత్తం 543  సీట్లు ఉండగా, ప్రస్తుతం 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. మొత్తం సభ్యుల్లో ఇది 15 శాతం కన్నా తక్కువే. పోయిన ఏడాది డిసెంబర్ నాటి లెక్కల ప్రకారం.. రాజ్యసభలోనూ మహిళల ప్రాతినిధ్యం 14 శాతం మాత్రమే ఉంది. తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు సహా 18 రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళా సభ్యులు 10 శాతం కన్నా తక్కువే ఉన్నారు. ఢిల్లీ, బీహార్, యూపీ సహా 7 రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 10 నుంచి 12 శాతమే ఉంది. దేశంలో అత్యధికంగా చత్తీస్ గఢ్ అసెంబ్లీలో 14.44 శాతం, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో 13.7 శాతం, జార్ఖండ్ అసెంబ్లీలో 12.35 శాతం మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.

అమలులోకి వస్తే ఇలా..

మహిళా రిజర్వే షన్ బిల్లు అమల్లోకి వస్తే లోక్ సభలో 181 మంది మహిళా ఎంపీలుంటారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్లకు సబ్​ రిజర్వేషన్లు కల్పిస్తారు.