దుబాయ్: విమెన్స్ వన్డే వరల్డ్ కప్–2029ను పది జట్లతో నిర్వహించాలని ఐసీసీ శుక్రవారం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్ల ఫార్మాట్‌ను విస్తరించనుంది. ‘ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌కు విశేషమైన ఆదరణ లభించింది. దీన్ని మరిన్ని దేశాలకు విస్తరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎడిషన్‌లో 10 జట్లకు అవకాశం కల్పిస్తాం.
ఈ సారి మెగా కప్ పోటీలను దాదాపు 3 లక్షల మంది స్టేడియాల్లో వీక్షించారు. విమెన్స్ క్రికెట్‌లో ఇదో రికార్డు. ప్రపంచ వ్యాప్తంగా ఆన్ స్క్రీన్ ప్రేక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇండియాలో 500 మిలియన్ల వ్యూయర్‌షిప్ నమోదైంది’ అని ఐసీసీ పేర్కొంది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, అమోల్ మజుందార్‌ను విమెన్స్ క్రికెట్ కమిటీలోకి తీసుకున్నారు.
