కోట్ల జాబ్స్‌‌‌‌ ఇచ్చేది ఇక మహిళలే

కోట్ల జాబ్స్‌‌‌‌ ఇచ్చేది ఇక మహిళలే

ఉమెన్ ఎంట్రప్రెనూర్‌‌‌‌‌‌‌‌షిప్ దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగాలను క్రియేట్ చేయబోతోందని తాజా రిపోర్ట్‌‌‌‌లు వెల్లడించాయి. 2030 నాటికి ఉమెన్ ఎంట్రప్రెనూర్‌‌‌‌‌‌‌‌షిప్ 15 కోట్ల నుంచి 17 కోట్ల వరకు ఉద్యోగాలు జనరేట్ చేస్తుందని బెయిన్ అండ్ కంపెనీ, గూగుల్ సంయుక్తంగా విడుదల చేసిన రిపోర్ట్‌‌‌‌లో వెల్లడించాయి. ఇవి మొత్తం వర్కింగ్ ఏజ్ పాపులేషన్‌‌‌‌కు కావాల్సిన కొత్త ఉద్యోగాల కంటే 25 శాతం ఎక్కువని ఈ రిపోర్ట్‌‌‌‌ తెలిపింది. ‘ఉమెన్ ఎంట్రప్రెనూర్‌‌‌‌‌‌‌‌షిప్ ఇన్ ఇండియా–పవరింగ్ ది ఎకానమీ విత్ హర్’పేరుతో గూగుల్, బెయిన్ అండ్ కంపెనీలు రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేశాయి. ఈ రిపోర్ట్‌‌‌‌లో ఉమెన్ ఎంట్రప్రెనూర్స్‌‌‌‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. ఇండియా ఎంప్లాయిమెంట్ ఛాలెంజస్‌‌‌‌ను వీరు పరిష్కరిస్తారని తెలిపాయి. ఈ రిపోర్ట్‌‌‌‌లో మహిళా వ్యాపారవేత్తలు ఆధిపత్యం ఉన్న ఆరు సెగ్మెంట్లను గుర్తించాయి. ఇండియాలో 1.35 కోట్ల నుంచి 1.57 కోట్ల వరకు మహిళలకు సంబంధించిన సంస్థలు ఉంటాయని అంచనావేశాయి. అంటే ఇప్పుడున్న మొత్తం సంస్థల్లో సుమారు 20 శాతమని పేర్కొన్నాయి. చాలా సంస్థలలో మహిళలను కేవలం ఫైనాన్షియల్,అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌ ఓనర్లుగా పేర్కొంటూ.. వారికి ఎలాంటి యాక్టివ్ రోల్స్‌‌‌‌ను ఇవ్వడం లేదన్నాయి. కానీ ఈ మధ్య పరిస్థితులు మారుతున్నాయని పేర్కొన్నాయి. మహిళలలోనే నిజమైన వ్యాపార దక్షత ఉంటుందని వివరించాయి.

మహిళలు నిర్వహించే వ్యాపారాల్లో మెజార్టీ సింగిల్ పర్సన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజస్( ఒకే వ్యక్తి నిర్వహించే సంస్థ)గా ఉన్నాయని పేర్కొన్నాయి. వీటిలో అతిపెద్ద గ్రూప్‌‌‌‌గా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర వ్యాపారాలు నిర్వహించే వారు 38 శాతం మంది ఉండగా.. అర్బన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ సోలోప్రెనూర్లుగా 31 శాతం మంది ఉన్నారు. అంటే వీరు ఇంటి నుంచే పనిచేస్తూ ఉంటారు. ఇతర సెగ్మెంట్లలో రూరల్ అగ్రిప్రెనూర్లున్నారు. వీరిలో వ్యవసాయాధారిత వ్యాపారాలు నిర్వహించే వారు 18 శాతం మంది, చిన్న వ్యాపార యజమానులు 14 శాతం మంది(10 మంది కంటే తక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే వారు) ఉన్నారు. చిన్న వ్యాపార యజమానులే దేశంలో ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు గూగుల్, బెయిన్ అండ్ కంపెనీ రిపోర్ట్‌‌‌‌ తెలిపింది.  ఇతరులు 10 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కల్పించే వారు. వీరు ఒకశాతం కంటే తక్కువే ఉన్నట్టు రిపోర్ట్ పేర్కొంది. మొత్తంగా మహిళా ఎంట్రప్రెనూర్లు ప్రత్యక్షంగా 2.2 కోట్ల నుంచి 2.7 కోట్ల మంది ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు చెప్పింది.

ఎకనమిక్, సోషల్ పరంగా అనూహ్య మార్పులు…

‘గత పదేళ్లలో ఇండియా ఎకనమిక్ ప్రొగ్రెస్ చూసుకుంటే, లేబర్ ఫోర్స్‌‌‌‌లో మహిళల భాగస్వామ్యం తగ్గింది. లేబుర్ ట్రెండ్స్ మారడం, సాంకేతికపరంగా అవాంతరాలు, సామాజిక అంశాలు వంటి కారణాలతో మహిళల లేబర్ ఫోర్స్ తగ్గిపోయింది. కానీ మహిళలలో ఎంట్రప్రెనూర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ను ప్రోత్సహించడం ప్రారంభించినప్పటి నుంచి ఇండియాలో ఎకనమిక్, సోషల్ పరంగా అనూహ్యమైన మార్పులు వచ్చాయి. అద్భుతమైన ఉద్యోగాలను వీరు జనరేట్ చేస్తున్నారు’ అని బెయిన్ అండ్ కంపెనీ పార్టరన్ మేఘా చావ్లా అన్నారు. ఇంటర్నెట్ సాథి ప్రొగ్రామ్ ద్వారా ఇండియాలో డిజిటల్ జెండర్ గ్యాప్‌‌‌‌ను తగ్గించడం, స్టార్టప్‌‌‌‌లు, ఎస్‌‌‌‌ఎంబీల్లో స్కిల్స్‌‌‌‌ను ప్రోత్సహించడం చేస్తున్నామని గూగుల్ ఇండియా, సౌత్‌‌‌‌ఈస్ట్ ఏసియా సీనియర్ కంట్రీ మార్కెటింగ్ డైరెక్టర్ సప్న చద్దా అన్నారు.