
వేములవాడ, వెలుగు: తమ సంఘం నుంచి వసూలు చేసిన డబ్బులు బ్యాంకు కరస్పాండెంట్ తమ అకౌంట్‌లో జమచేయలేదని ఆరోపిస్తూ వేములవాడ యూనియన్ బ్యాంక్ ఎదుట పురుగు మందు డబ్బాలతో మహిళలు నిరనన తెలిపారు. వారి వివరాల ప్రకారం.. వేములవాడ మున్సిపల్‌పరిధిలోని కోనాయిపల్లిలోని సాయిబాబా మహిళా సంఘం సభ్యుల నుంచి యూబీఐ కరస్పాండెంట్ జ్యోతి రూ.5.26లక్షలు వసూలు చేసింది.
వాటిలో రూ.2.70లక్షలు మాత్రమే అకౌంట్‌లో వేసి, మిగతా డబ్బు తనకు సంబంధం లేదంటోందన్నారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన సభ్యులు గురువారం బ్యాంకు ఎదుట పురుగు మందు డబ్బాలతో నిరసన తెలిపారు. ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ సురేశ్‌ను వివరణ కోరగా బ్యాంకు నిబంధనల ప్రకారం కరస్పాండెంట్ జ్యోతి నుంచి డబ్బులను రికవరీ చేసి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.