ఒక్క చీర కోసం..తెల్లవారుజామునుంచే మహిళల క్యూ..ఆ చీరలకు ఎందుకింత డిమాండ్?

ఒక్క చీర కోసం..తెల్లవారుజామునుంచే మహిళల క్యూ..ఆ చీరలకు ఎందుకింత డిమాండ్?
  • బెంగళూరు కేఎస్ఐసీ షోరూమ్‌‌ల వద్ద రద్దీ

బెంగళూరు: మైసూర్‌‌ సిల్క్ చీరల కోసం మహిళలు తెల్లవారుజామున 4 గంటల నుంచే దుకాణం ముందు క్యూ కడుతున్నారు. బెంగళూరులోని కర్నాటక సిల్క్‌‌ ఇండస్ట్రీస్‌‌ కార్పొరేషన్‌‌(కేఎస్ఐసీ) షోరూమ్‌‌ ముందు బారులు తీరుతున్నారు. ఓపెన్‌‌ చేయక ముందే షాప్‌‌ ముందు కిలోమీటర్ల మేర మహిళలు క్యూ కనిపిస్తున్నది.

  ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌‌ అవుతున్నాయి. మైసూర్‌‌ సిల్క్ చీర ధర ఒక్కటి రూ.23 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. అయినప్పటికీ మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఈ చీరలకు ఎందుకింత డిమాండ్ ?

మైసూర్ సిల్క్ అంటేనే ఒక రాయల్ లుక్. కర్నాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(కేఎస్ఐసీ) ద్వారా మాత్రమే తయారవుతాయి.  ఈ చీరలు సాఫ్ట్ టెక్స్చర్, అద్భుతమైన షైన్ (ప్రకాశం), దీర్ఘకాలిక డ్యూరబిలిటీ (దశాబ్దాల పాటు మెరుపు తగ్గకుండా ఉండటం)తోపాటు లైట్ వెయిట్ ఉంటాయి. 

జరి వర్క్‌‌లో 65% ప్యూర్ సిల్వర్ + 0.65% గోల్డ్ ఉపయోగించడం వల్ల ఇవి భారతదేశంలోనే అత్యంత ఖరీదైన, ప్రీమియం సిల్క్ చీరలుగా గుర్తింపు పొందాయి. 

అందుకే ధరలు రూ.23 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉన్నప్పటికీ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌గా, హెరిటేజ్ పీస్‌‌గా చూస్తున్నారు. ఉత్పత్తి పరిమితంగా  ఉండటంతో సప్లై డిమాండ్‌‌కు తగ్గట్టు లేదు. దీంతో షోరూమ్‌‌ల్లో స్టాక్ త్వరగా అయిపోతున్నది. 

రద్దీని కంట్రోల్ చేయడానికి కేఎస్ఐసీ సిబ్బంది టోకెన్ సిస్టమ్​ను  కఠినంగా అమలు చేస్తున్నారు. షోరూమ్‌‌లో ఎంట్రీకి టోకెన్ తప్పనిసరి. ఒక్కో కస్టమర్‌‌కు ఒక చీర మాత్రమే అమ్ముతున్నారు.