బిల్లులు రాక మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

బిల్లులు రాక మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట: చేసిన పనులకు బిల్లులు రాకపోవటంతో సూర్యాపేట జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసింది. చివ్వెంల మండలం పిల్లలజగ్గు తండాకు చెందిన ధరావత్ ఉపేంద్ర.. టీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‎గా గెలిచింది. అప్పులు చేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేయించింది. బిల్లులు రాగానే డబ్బులు ఇస్తానని అప్పులు ఇచ్చిన వారికి మాట ఇచ్చింది. అయితే నెలలు గడుస్తున్నా బిల్లులు రాలేదు. మరోవైపు అప్పులు ఇచ్చిన వారు పైసల కోసం ఒత్తిడి పెంచారు. దాంతో మనస్థాపానికి గురైన ఉపేంద్ర.. పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను సూర్యాపేట జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‎కు తరలించారు. ప్రస్తుతం సర్పంచ్ పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. తమ అమ్మాయిని ప్రభుత్వమే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు.

For More News..

అసెంబ్లీలో మైక్ లాక్కొని అయినా మాట్లాడుతాం

దారుణం.. 15 ఏళ్ల అమ్మాయిపై 29 మంది అత్యాచారం