మహిళలు అర్ధరాత్రి కూడా తిరిగే పరిస్థితి ఉండాలి

మహిళలు అర్ధరాత్రి కూడా తిరిగే పరిస్థితి ఉండాలి

నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఘటన నా మనసు కలచివేసింది

మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటా: సీఎం జగన్

అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద నర్సింగ్ విద్యార్థినిపై ఇద్దరు పాశవికంగా అత్యాచారం చేసిన ఘటన తన మనసును కలచివేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ‘‘జరిగిన ఘటన చాలా దురదృష్టకరం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి అవాంఛనీయ ఘటన జరిగినందుకు చింతిస్తున్నా.. మహిళలు అర్ధరాత్రిపూట కూడా తిరగగలిగే పరిస్థితి ఉండాలి.. అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను..’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. 

మహిళల కోసం ప్రత్యేకంగా 900 మొబైల్ టీములు ఏర్పాటు చేశామని.. దిశ చట్టం తీసుకురావడంతోపాటు.. దిశ యాప్ ను అభివృద్ధి చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నానని సీఎం జగన్ వివరించారు. మహిళల రక్షణ కోసం దిశ పోలీసు స్టేషన్లను కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్ల ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన జరిగినందుకు చింతిస్తున్నానని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసకుంటానని, మీ అన్నగా.. తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతానని ఆయన హామీ ఇచ్చారు.