Women Special : బాధలో ఉన్నప్పుడు ఆడవాళ్లూ.. ఆడవాళ్లతోనే మాట్లాడండి..!

Women Special : బాధలో ఉన్నప్పుడు ఆడవాళ్లూ.. ఆడవాళ్లతోనే మాట్లాడండి..!

మనసులో బాధ ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే తగ్గుతుంది అంటారు. అలా ఒక అమ్మాయి, మరో అమ్మాయితో తన బాధని చెప్పుకుంటే స్ట్రెస్ చాలావరకు తగ్గుతుందట. ఈ విషయం ఈ మధ్య చేసిన ఒక స్టడీలో తేలింది. తమ ఫీలింగ్స్ ను వేరే ఆడవాళ్లతో షేర్ చేసుకునే అమ్మాయిల్లో స్ట్రెస్ దూరమవుతుందని ఈ స్టడీ తేల్చింది.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ కు చెందిన బెక్ మన్ ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్ డ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన రీసెర్చర్స్ లేటెస్ట్ గా ఫ్రెండ్స్, ఫ్రెండ్ షిప్ చూపించే ప్రభావం, ఒత్తిడిని తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుంది వంటి విషయాలపై, ఒక స్టడీ చేశారు. కొంతమంది. ముసలివాళ్లు, ఇంకొంతమంది
యువతులు ఈ స్టడీలో పాల్గొన్నారు. ద జర్నల్ ఆఫ్ ఉమెన్ అండ్ ఏజింగ్ లో ఈ స్టడీ పబ్లిష్ అయ్యింది.

కమ్యూనికేషన్ తోనే...

అవసరమైనప్పుడు కావాల్సినవాళ్లతో కమ్యూనికేట్ అయితే చాలా ఉపయోగం ఉంటుంది. ఫ్రెండ్స్, బిజినెస్ పార్టనర్స్, కొలీగ్స్ ఎవరైనా తమ మధ్య వచ్చిన మనస్పర్ధలు దూరమయ్యేందుకు, వాళ్ల గురించి చెప్పుకునేందుకు కమ్యూనికేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ కమ్యూనికేషన్ ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఉంటే ఇంకా హెల్ప్ అవుతుందనేది ఈ స్టడీ సారాంశం.ముఖ్యంగా ఇద్దరూ ఫ్రెండ్స్ అయి, ఒకరితో ఒకరు తమ ఫీలింగ్స్ న్న షేర్ చేసుకుంటే స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయట. 

ఒకేలాంటి మనస్తత్వం.. 

ఎక్కువ కమ్యూనికేట్ అయ్యి, ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలంటే ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉండాలి. ఇద్దరి అభిప్రాయాలు కలిసినప్పుడే, ఎక్కువగా మాట్లాడుకోగలుగుతారు. స్ట్రెస్ లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటే కార్టిసోల్ అనే హార్మోన్ లెవల్స్ తగ్గుతాయి. ఈ హార్మోన్ స్ట్రెస్ లెవల్స్ ని పెంచుతుంది. ఈ హార్మోన్ తగ్గితే, స్ట్రెస్ తగ్గుతుంది. ఆడవాళ్లు, ఆడవాళ్ల కమ్యూనికేట్ అవ్వడం వల్ల కార్టిసోల్ తగ్గి, స్ట్రెస్ కూడా తగ్గుతుంది.