2022 మే నుంచే ఎన్​డీఏలోకి మహిళలు

2022 మే నుంచే ఎన్​డీఏలోకి మహిళలు
  • సుప్రీంకోర్టుకు చెప్పిన రక్షణ శాఖ

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించే నేషనల్​ డిఫెన్స్​ అకాడమీ ప్రవేశ పరీక్ష ద్వారా మహిళా అభ్యర్థులను డిఫెన్స్​ సర్వీస్​లోకి తీసుకోనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. యూపీఎస్సీ ఏడాదికి  రెండు సార్లు ఎన్​డీఏ ఎగ్జామ్​ నిర్వహిస్తోందని, 2022 మే నెలలో వెలువడే నోటిఫికేషన్​ ద్వారా మహిళా అభ్యర్థులను అనుమతిస్తామని సుప్రీంకు అఫిడవిట్​సమర్పించింది. మహిళలను డిఫెన్స్​ సర్వీసులోకి అనుమతించకపోవడంపై గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్​దాఖలైన విషయం తెలిసిందే. ఈమేరకు మహిళలను అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్​మొదటి వారంలో జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు తెలిపింది. కాగా దేశంలో మహిళలకు శాశ్వత కమిషన్​ను ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే దానిపై కేంద్రాన్ని టైమ్​లైన్​ కోరిన సుప్రీం.. మహిళలను డిఫెన్స్​సర్వీస్​లోకి తీసుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారో అఫిడవిట్ ​దాఖలు చేయాలని సూచించింది. ఈమేరకు కేంద్ర రక్షణ శాఖ సుప్రీంకు అఫిడవిట్​సమర్పించింది. మహిళలకు శాశ్వత కమిషన్​ ఏర్పాటు టైమ్​లైన్ ను దృష్టిలో ఉంచుకున్నామని, వచ్చే మే నాటికి మహిళా అభ్యర్థులకు అవసరమైన శిక్షణాపరమైన కరికులం, ప్రణాళికను రూపొందించేందుకు ఎక్స్​పర్ట్స్ గ్రూప్ ​ఏర్పాటు చేసినట్లు అఫిడవిట్​లో సుప్రీంకు తెలిపింది.