- పాల్గొన్న 1,100 మందికి పైగా రన్నర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ‘స్టార్లైట్స్ట్రైడ్స్ – మహిళల నైట్ రన్ 2026 ఆరో ఎడిషన్ లో 1,100 మందికి పైగా మహిళా రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో 10 కె టైమ్డ్ రన్, 5 కె టైమ్డ్ రన్, 5 కె ఫన్ రన్ నిర్వహించగా.. ‘గిఫ్ట్ ఎ రన్’ ద్వారా పలు స్వచ్ఛంద సంస్థల మహిళలకు ఉచిత ప్రవేశం కల్పించారు.
ఈ సారి మహిళలు తమ సంస్కృతిని ప్రతిబింబిస్తూ చీరలు ధరించి పరుగెత్తేలా ప్రత్యేక కేటగిరీని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా 'బ్రాండ్ మందిర్' సహకారంతో చీర కట్టుకుని పరుగు పూర్తి చేసిన వారికి రూ.2.50 లక్షల విలువైన గిఫ్ట్ఓచర్లు గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పించారు.
దీంతో ఎక్కువ శాతం మంది చీరలతో పరిగెత్తి ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ చేపట్టిన ఆరు వారాల ‘విమెన్స్ కౌచ్25 కే’ ట్రైనింగ్ ముగింపులో భాగంగా 180 మందికి పైగా మహిళలు 5 కే గ్రాడ్యుయేషన్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
