అమిత్ షా ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వడమేంటి?: థరూర్

అమిత్ షా ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వడమేంటి?: థరూర్

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కామెంట్ చేశారు. షా ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకోవడం ఏంటని థరూర్ ప్రశ్నించారు. ‘హోం మినిస్టర్ తన ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎయిమ్స్‌కు వెళ్లకుండా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకోవడంపై నేను ఆశ్చార్యానికి గురయ్యా. ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు శక్తిమంతమైన ప్రాపకం కావాలి’ అని థరూర్ చెప్పారు.

‘ప్రాథమిక లక్షణాలు కనిపించగానే నేను కరోనా వైరస్ టెస్టు చేయించుకున్నా. ఆ రిపోర్టులో పాజిటివ్‌ వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. అయినా డాక్టర్ల సలహా మేరకు నేను ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యా’ అని అమిత్ షా ఆదివారం చెప్పారు. గత వారంలో షాను కలిసిన బీజేపీ లీడర్ వినయ్ సహస్రబుద్ధే, జూనియర్ ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్ బాబుల్ సుప్రియో కలిసిన వారిలో ఉన్నారు. వీరు క్వారంటైన్‌లో ఉండాలని నిశ్చయించుకున్నారు.