నాకు సీఎం జగన్ అంటే చాలా ఇష్టం : హీరో విశాల్

నాకు సీఎం జగన్ అంటే చాలా ఇష్టం : హీరో విశాల్

ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై పోటీ చేసే అవకాశం లేదని ప్రముఖ నటుడు, తమిళ సినీ నిర్మాత విశాల్ స్పష్టం చేశారు. ఆయనకు చంద్రబాబు కంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే చాలా ఇష్టమని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు ప్రత్యర్థిగా కుప్పం నియోజకవర్గంలో పోటీ చేయడం లేదని, కుప్పం నియోజకవర్గంలో తనకు వ్యాపారాలు ఉన్నాయని అన్నారు. 

ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని విశాల్ చెప్పారు. ప్రజాసేవ చేసే ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులేనన్న విశాల్... రానున్న కాలంలో రాజకీయాల్లోకి వస్తారా అనే అంశంపైనా క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పారు. కుప్పం గురించి తనకు అన్నీ తెలుసని, నటుడిగా ఎమ్మెల్యేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నానన్నారు. ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులేనని ఈ సందర్భంగా విశాల్ చెప్పారు.