CAA ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: అమిత్‌ షా

CAA ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: అమిత్‌ షా

కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా అల్లర్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా. దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యతిరేక, అనుకూల ప్రదర్శలనతో చర్చనీయాంశంగా మారిన పౌరసత్వం చట్టం CAA అమలుపై ఆయన మరోసారి వ్యాఖ్యానించారు. CAA ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు అమిత్‌ షా. లక్నోలో మంగళవారం జరిగిన CAA అనుకూల ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడారు. దేశాన్ని ముక్కలు చేయాలంటున్న టుకడే టుకడే గ్యాంగ్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఇండియాకు వ్యతిరేకంగా ఎవరు  పనిచేసినా ..జైలుకు వెల్లక తప్పదని తేల్చిచెప్పారు. CAAపై రాహుల్‌ గాంధీ, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఎక్కడ చర్చ కోరుకుంటే అక్కడ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు అమిత్‌ షా. కాంగ్రెస్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఒకే స్వరంతో మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.