
ముంబై: పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంపై బీజేపీని టార్గెట్ చేస్తూ శివసేన పార్టీ విమర్శలు చేసింది. పుదుచ్చేరిలో అమలు చేసిన వ్యూహాలు మహారాష్ట్రలో పని చేయవంటూ శివసేన తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో ఫైర్ అయ్యింది. మహారాష్ట్ర సర్కార్‌ను కూల్చాలన్న బీజేపీ ఆశ ఎప్పటికీ ఓ కలగానే మిగిలిపోతుందని పేర్కొంది. మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరిగా కాకుండా సక్సెస్‌ఫుల్‌గా తాము సర్కార్‌ను నడిపిస్తున్నామని స్పష్టం చేసింది. పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా బీజేపీ తన అహంకారాన్ని మరోమారు నిరూపించుకుందని దుయ్యబట్టింది.