Good Health: వెలగపండు... వెలకట్టలేని ఆరోగ్యం...

Good Health: వెలగపండు... వెలకట్టలేని ఆరోగ్యం...

వెలగపండులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.ఈ పండును తినడం వలన మనం అనేక ఆరోగ్య సమస్యల ( Health problems )నుండి బయటపడవచ్చు. ఎన్నో అనారోగ్య సమస్యలు నయం చేసే గుణాలు ఈ పండులో ఉన్నాయి.కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆహారంగా ఈ పండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు వెలగ పండులో ఉండే ఔషధ గుణాలు గురించి... అలాగే దాన్ని తినడం వలన  కలిగే ప్రయోజనాల గురించి   తెలుసుకుందాం.

వెలగపండుకి అత్యంత  విశిష్టమైన స్థానం ఉంది.దీనినే ఎలిఫెంట్ యాపిల్ లేదా ఉడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు.రుచికి వగరు, పులుపు , తీపి కలిగిన ఈ పండు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఈ  పండులో సిట్రిక్ అమ్లాలు, రిబోఫ్లోవిన్ , పిండిపదార్థాలు, ఆక్సాలిక్ , ప్రొటీన్లు, నియాసిస్ , కాల్షియం, ఐరన్ వంటి పుషకాలు సమృద్ధిగా ఉన్నాయి.

అలాగే ఈ వెలక్కాయలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉన్నాయి.ఈ వెలగ పండు శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరీయాతో పోరాడతాయి. అర్థరైటిక్ నొప్పిలతో బాధపడుతున్న వారికి ఈ వెలగ పండు ఎంతగానో సహాయపడుతుంది.మలబద్ధకంతో బాధపడేవారికి వెలగపండు దివ్య ఔషధం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  

100 గ్రాముల వెలగపండు గుజ్జు ద్వారా 140 క్యాలరీలు, 32 గ్రాముల పిండి పదార్దాలు, 2 గ్రాముల ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, సిట్రస్ ఆమ్లాలతో పాటు ఇంకెన్నో శరీరానికి అందుతాయి. ఇకపోతే వెలగపండును తినటం వల్ల  అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

వెలగపండుతో ఆరోగ్య ప్రయోజనాలు:

  • ✤ వెలగ పండులో సిట్రిక్ అమ్లాలు, రిబోఫ్లోవిన్ , పిండిపదార్థాలు, ఆక్సాలిక్ , ప్రొటీన్లు, బీటా కెరోటిన్ , ఫాస్పరస్, థైమీన్ , నియాసిస్ , కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి. దీంతో ఈ పండు మనశరీరానికి హాని కలిగించే బ్యాక్టీరీయాతో పోరాడతాయి. అంతేకాదు ఈ వెలగపండులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి. దీంతో అకాల వృద్ధాప్యాన్ని దరి చేయనీయదు.
  • ✤ వెలగపండుతో తయారైన కషాయం సేవిస్తే జలుబు తగ్గిస్తుందని అంటారు. దీంతో పాటు, ఇది జలుబు వల్ల కలిగే శ్లేష్మం (కఫం) ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఉబ్బసం వ్యాప్తిని వెలగపండు తగ్గిస్తుంది.
  • ✤ కళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్, కళ్ల మంటలకు చికిత్స చేయడానికి వెలగపండు ఎంతో సహాయపడుతుంది.
  • ✤ కడుపు రుగ్మతలలో, వెలగ పండ్లను ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మలబద్ధకం తొలగిపోతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి వెలగపండు దివ్య ఔషధం అని చెప్పవచ్చు.
  • ✤ వెలగ పండులో సహజసిద్ధమైన ఫైటోకాంపౌండ్లు, విటమిన్లు , ఫ్లేవనాయిడ్లు అధికం.. దీంతో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది.
  • వెలగపండు
  • ✤ ఆర్థరైటిక్ నొప్పి నిర్వహణకు వెలగపండు సహాయపడుతుంది.
  • ✤ వెలగ పండులో హైడ్రేటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉన్న ఎలక్ట్రోలైట్‌లు ద్రవ సమతుల్యతను కాపాడతాయి. దీనిలో ఉన్న పొటాషియం శరీరం నుంచి విసర్జింజపబడే అధిక నీటి నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
  • ✤ క్యాన్సర్ నివారణకు కూడా వెలగ పండు సహాయపడుతుంది.
  • ✤ వెలగ పండులో శోథ నిరోధక లక్షణాలు ఉండటం వల్ల గాయాలను త్వరగా నయం చేస్తుంది. తామర గజ్జి వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
  • ✤ వెలగపండు కాలేయ ఆరోగ్యానికి మంచి ఆహారం. హృద్రోగులకూ మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కంటికి కూడా మంచిది. మహిళలు ఈ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
  • ✤ వెలగపండులో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉన్నాయి. దీంతో నీరసం ఉన్నవారు వెలగపండును తింటే తక్షణ శక్తి లభిస్తుంది.
  • ✤ వెలగపండు గుజ్జు మగవారిలో వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. ఈ పండుకు 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది