వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలి : కలెక్టర్ బీఎస్.లత

వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలి :  కలెక్టర్ బీఎస్.లత

మల్యాల, వెలుగు: వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) బీఎస్.లత ఆదేశించారు. శనివారం కొండగట్టు, ముత్యంపేటలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అదేరోజు మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. సివిల్ సప్లై ఆఫీసర్ ​ప్రసాద్ ఉన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మల్లాపూర్, వెలుగు: రాఘవపేట్ లో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శనివారం ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయంలో 40 మందికి కల్యాణలక్ష్మి,  20 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఏఎంసీ చైర్ పర్సన్ పుష్పలత, లీడర్లు శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి, మల్లయ్య, రాకేశ్, నగేశ్​ ఉన్నారు.

ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి  

సుల్తానాబాద్, వెలుగు: రైతులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. చిన్నకల్వల గ్రామంలో పీఏసీఎస్​ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. 

అనంతరం ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం దెబ్బతింటుందని తెలిపారు. సహకార సంఘం చైర్మన్ దేవరనేని మోహన్ రావు, సీఈవో  రమేశ్, జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్​రావు పాల్గొన్నారు.